చిత్రం : దేవుడమ్మ (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ
నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ
ఓహొ హొ హొ హొ హొ... లాలా లాలా లాలాలా లా లా
చరణం 1 :
పెడదారిలోనా పడిపోవు వేళా.. రహదారి నీవే చూపావూ
పెడదారిలోనా పడిపోవు వేళా.. రహదారి నీవే చూపావూ
నీ అడుగులలో నడిచేనూ.. నీలో నేనూ నిలిచేనూ
నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ
మ్హు ఊ ఊ ఊ ఊ.. అహా అహా హా హా హా
చరణం 2 :
నా జీవితానా తొలిపూల వానా.. కురిపించే నేడూ నీ నవ్వులే
బడివైన నీవే . . గుడివైన నీవే.. గురువూ దైవం నీవేలే
తరగని కలిమీ మన స్నేహం.. నీదీ నాదీ ఒక ప్రాణం
నీ మాటంటే నాకూ అదే వేదమూ.. నీ తోడుంటే చాలూ అదే లోకమూ
మ్హు ఊ ఊ ఊ ఊ.. మ్హు ఊ ఊ ఊ ఊ..
మ్హు ఊ ఊ ఊ ఊ.. మ్హు ఊ ఊ ఊ ఊ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4538
No comments:
Post a Comment