Friday, October 30, 2015

అందమంతా చీరగట్టి

చిత్రం : దేవుడు మావయ్య (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి : 

హా.. అందమంతా చీరగట్టి... పరువంతా పైట లేసి
అందమంతా చీరగట్టి... పరువంతా పైట లేసి
బిడియమంతా బొట్టు పెట్టి... బిడియమంతా బొట్టు పెట్టి
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా...  అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా

ఆరుబైటా కన్నుగొట్టి.. ఊరుబైటా కొంగు పట్టి

అలకలెన్నో మొలకలెత్తి.. అలకలెన్నో మొలకలెత్తి..
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ.. ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ

చరణం 1 :

ఆ కుర్రబుగ్గలో ఎర్రగులాబి... ఆ లేత పెదవిలో తీపి జిలేబి
కోసుకోమంటున్నది.. కోడెవయసు
తీసుకోమంటున్నదా.. కన్నెమనసు

చెరువునడిగి కోసుకో... చేపనడిగి తీసుకో
చెరువునడిగి కోసుకో... చేపనడిగి తీసుకో
కలువపువ్వు తెమ్మంటే... తేనెవిందులిమ్మంటే
కాదంటానా.. లేదంటానా.. హా
కాదంటానా.. హా..  లేదంటానా 

అందమంతా చీరగట్టి... అహా...
పరువంతా పైట లేసి... ఓహో... 

చరణం 2 :

ఆ పూత పొగరులో కోటి స్వరాలు... అవి వింటే నాలో కొంటె జ్వరాలు
ఆదుకోమంటున్నది.. కన్నెపడుచు
చేదుకోమంటున్నదా.. తీపి వయసు

చెట్టునడిగి కోసుకో... పిట్టనడిగి తీసుకో
చెట్టునడిగి కోసుకో... పిట్టనడిగి తీసుకో
కన్ను చెదిరిపోతుంటే.. కన్ను చెదిరిపోతుంటే
కాదంటానా.. లేదంటానా
కాదంటానా.. లేదంటానా  

అందమంతా చీరగట్టి... పరువంతా పైట లేసి
బిడియమంతా బొట్టు పెట్టి... బిడియమంతా బొట్టు పెట్టి
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా... అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా
అటు తిరిగి నిలబడితే ఏం తక్కువా... అటు కన్నా ఇటు వైపే అందమెక్కువా 

ఆరుబైటా కన్నుగొట్టి.. ఊరుబైటా కొంగు పట్టి
ఆరుబైటా కన్నుగొట్టి.. ఊరుబైటా కొంగు పట్టి
అలకలెన్నో మొలకలెత్తి.. అలకలెన్నో మొలకలెత్తి..
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ.. ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ
అటు తిరిగి నిలబడితే అల్లరెక్కువ.. ఎటు తిరిగి నిలబడ్డా ఆకలెక్కువ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2662

No comments:

Post a Comment