Monday, October 5, 2015

ప్రియతమా నీ ఊపిరే నాకు ప్రాణం

చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, జానకి  



పల్లవి: 



ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు...  నేనే శూన్యము
నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..
ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం




చరణం 1 :


తోడు నీడై.. అడుగుల జాడై.. నడిచే నడకలు నీవే
తేనియ వలపై.. తీయని పిలుపై.. పలికే పలుకులు నీవే 


ఈ అనురాగమే జీవితమూ.. ఈ అనుబంధమే శాశ్వతమూ
నాలో నీవై.. నీలో నేనై.. ఒకటై పోదాం నేడే ..

ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం 



చరణం 2 :



ఎన్ని తరాల.. ఎన్ని యుగాల...  మారని మనసు నీవొ
ఎన్నడు లేని.. ఎవరికి లేని.. మాయని మమతవు నీవొ


ఎదలో ఉన్నది ఆలయము...  అది నా దేవత మందిరము
మన ఈ జంటే.. గుడి జేగంటై.. మోగాలి కలకాలం..


ప్రియతమా....  నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు...  నేనే శూన్యము
నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..


ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6009

No comments:

Post a Comment