Monday, October 5, 2015

నడిచే ఓ అందమా




చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల 





పల్లవి : 


నడిచే ఓ అందమా.. పరుగే నీ పందెమా
పండగంటి పడుచువాణ్ణి.. ఎండకంటి చూపువాణ్ణి
అంటుకోవు.. జంటకావు.. పంతమా
నడిచే ఓ అందమా..



నడకే నా అందము... పరుగే నీ కోసము
మల్లెపూల మనసుదాన్ని... వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే అంతులేని తాపము
నడకే నా అందము... 




చరణం 1 :



నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ ఏక తాళమైనది
నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ ఏక తాళమైనది

నీ పలుకుల్లో పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో వలపు వెల్లువైనది
నీ పలుకుల్లో పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో వలపు వెల్లువైనది


చూపుల సుడివడి... అడుగులు తడవడి
చూపుల సుడివడి... అడుగులు తడవడి
మనసులు ముడిపడితే అందమూ.. రాగబంధము


నడిచే ఓ అందమా..ఆ.. ఆ.. నడకే నా అందము



చరణం 2 :



నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి..
నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి
నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి..
నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి

నీ చూపులలో వెన్నెల మునిమాపులున్నవి
అవి ఎండలలో విరివెన్నెల దండలైనవి
నీ చూపులలో వెన్నెల మునిమాపులున్నవి
అవి ఎండలలో విరివెన్నెల దండలైనవి


అడుగులు దూరమై.. ఎడదలు చేరువై..
అడుగులు దూరమై.. ఎడదలు చేరువై..
వయసులు గుడికడితే అందమూ.. ప్రేమబంధము


నడిచే ఓ అందమా.. పరుగే నీ పందెమా 

మల్లెపూల మనసుదాన్ని... వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే అంతులేని తాపము...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3693

No comments:

Post a Comment