Thursday, October 29, 2015

కుశలమేనా.. కుర్రదానా

చిత్రం :  మన్మథ లీల (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి : 


కుశలమేనా.. కుర్రదానా...  నీ హృదయమూ శాంతించెనా
కుశలమేనా.. భామలంతా... మీ విషయమూ నేనెరుగనా
కుశలమేనా.. కుర్రదానా... నీ హృదయమూ శాంతించెనా
కుశలమేనా.. భామలంతా...  మీ విషయమూ నేనెరుగనా 



చరణం 1 :


నన్నెందరో కోరి కోరి వెంటాడినా
నన్నెందరో కోరి కోరి వెంటాడినా ఉండలేక నే తిరిగినా
ఊరిలోన విహరించినా...  నా ప్రాణం నీవే సుమా

 స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే...
  స్త్రీ అన్నది ఒక్కసారె ప్రేమించునే..
ఒకరితోనే జీవించునే... సుఖములిచ్చి లాలించునే... మా నీతి మీకున్నదా
 మీ విషయమూ నేనెరుగనా ... మీ విషయమూ నేనెరుగనా  
 



చరణం 2 :



పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి
పసిపిల్లలే ఇంట ఉంటే యిల్లాలికి
కొంత శాంతి ప్రతి దానికి ఆ బాగ్యం కరువైనది
మీ మనసే రాయి అయినది...
మీ మనసే రాయి అయినది
ఈ రోజున తెలుసుకుంటిని ఈ వేదన పిల్లలుంటే ప్రేమించనా
కోరుకుంటే కాదంటినా.. ఒక్కటైతే యిక ఆగునా 



చరణం 3 :


నా పెన్నిధి నా మీద దయగన్నది... కోడెవయసు తోడయినది
పక్కమీద చోటున్నది ఇద్దరినీ రమ్మన్నది
ఇలా కోరితే కోరుకున్న సుఖం యివ్వనా
పరులకన్న హీనమయితినా.. ఆ మాత్రం  కవ్వించనా..  ప్రేమించి మురిపించనా 





No comments:

Post a Comment