Monday, October 5, 2015

ఆ రాగ సంధ్యలో మూగ కోరిక

చిత్రం : ఇంద్రుడు చంద్రుడు (1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : జాలాది
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి : 

ఆ.. హా.. హా.. ఓ..ఓ.. ఓ..
ఆ.. హా.. హా.. ఓ..ఓ.. ఓ..



ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక
ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక
పలికితే ప్రణయరాగ బంధము
కదిలితే మధురసుధల కావ్యము.. ఓ.. ఓఓ



ఆ రాగ సంధ్యలో రాజహంసలా
ఈ రాధ గుండెలో అనురాగ వీణలా


పాడితే ప్రణయరాగ బంధము
ఆడితే .. యమునగమన గీతము.. ఊ.. ఊ.. 




ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక



చరణం 1 :


శృంగార సంగీత రాణివని.. మంజులవాణివని
గంగాతరంగాల జాణవని..  జాబిలికూనవని 



సరిసరి.. గడసరి.. తుమ్మెద రొద ఝుమ్మందిలే
పెదవుల సుమధుర సుధలెన్నో కోరిందిలే



బిడియములేలా... వగలే సెగలాయెనే..
బిడియములేలా... వగలే సెగలాయెనే..


శంకరాభరణమే నీవని...
శంకరాభరణమే నీవని...
ప్రమీలార్జున ప్రణయమే మనమని...




ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక 




చరణం 2 :



పొంగే తరంగాల భంగిమలో.. ప్రణయ మృదంగినిలో
అందాలు చిందే సురేంద్రుడని.. చందన చంద్రుడని

అందిన సుందర సంధ్యారుణ విందాయెనే...
రంగులు పొంగిన రమణీమణి కల్యాణియే..హా..

వెన్నెల దొర.. ఈ వన్నెలు ఇక చాలురా
వెన్నెల దొర.. ఈ వన్నెలు ఇక చాలురా

పులకింత పున్నమి చెలరాటలో...
పులకింత పున్నమి చెలరాటలో...
గిలిగింతల తొలివలపులు తీర్చవే



ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక 


పలికితే ప్రణయరాగ బంధము
కదిలితే మధురసుధల కావ్యము.. ఊ.. ఊ.. 


ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7897

No comments:

Post a Comment