Thursday, October 8, 2015

కొప్పు చూడు కొప్పందం చూడు

చిత్రం :  మానవుడు-దానవుడు (1972)
సంగీతం :  అశ్వత్థామ
గీతరచయిత :  ఉషః శ్రీ
నేపథ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి, మాదవపెద్ది సత్యం




పల్లవి :



కొప్పు చూడు కొప్పందం చూడు.. కొప్పున వున్న పూలను చూడు
కొప్పు చూడు కొప్పందం చూడు.. కొప్పున వున్న పూలను చూడు
మగడా నే మునుపటి వలెనే లేనా?


అహా! అలాగా!
కొప్పులో పూలెక్కడివే?.. నీ కొప్పులో పూలెక్కడివే?
అవా?



కట్టెల కోసమెళితే.. నే కట్టెల కోసమెళితే
కొమ్మ తగిలి కొప్పు నిండింది మావా
కొమ్మతగిలి కొప్పు నిండింది మావా



చరణం 1 :



ముక్కు చూడు ముక్కందం చూడు.. ముక్కున వున్న ముక్కెర చూడు
ముక్కు చూడు ముక్కందం చూడు.. ముక్కున వున్న ముక్కెర చూడు


మగడా.. నే మునుపటివలెనే లేనా?
మగడా.. నే మునుపటివలెనే లేనా?  


ఆ!ఆహా!
బుగ్గమీద గాటెక్కడిదే?.. నీ బుగ్గమీద గాటెక్కదిదే?
కోమటింటికెళితే నే బెల్లం తూయమంటే.. 

కోమటింటికెళితే నే బెల్లం తూయమంటే
తక్కెట్లో రాయొచ్చి తగిలింది మావా.. 

తక్కెట్లో రాయొచ్చి తగిలింది మావా



చరణం 2 :



నడుము చూడు నడుమందం చూడు.. నడుమునవున్న బిగువును చూడు
నడుము చూడు నడుమందం చూడు.. నడుమునవున్న బిగువును చూడు


మగడా.. నే మునుపటివలెనే లేనా?
మగడా.. నే మునుపటివలెనే లేనా?


ఆ.. అది సరే..
గంపకింద వాడెవడే?
ఈ గంపకింద వాడెవడే?
ఆహా! వాడా



పక్కింటి పోరగాడు.. పెట్టాను పట్టబోయి.. కోడిపెట్టాను పట్టబోయి
గంపకింద నక్కి నక్కి కూకున్నాడు మావా

గంపకింద నక్కి నక్కి కూకున్నాడు మావా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6347

No comments:

Post a Comment