Friday, November 6, 2015

ఈ చల్లని లోగిలిలో

చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :   సుశీల 

పల్లవి :

ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి

ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి ... అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో... 

చరణం 1 :

పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా...
పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి 

ఈ చల్లని లోగిలిలో .... 

చరణం 2 :

శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
లక్ష్మి.. సరస్వతి పొందికగా ...  ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి .... 

ఈ చల్లని లోగిలిలో .... 

చరణం 3 :

ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో....
వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి

ఈ చల్లని లోగిలిలో....  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1213

No comments:

Post a Comment