Friday, November 6, 2015

నా హృదయపు కోవెలలో







చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :   బాలు   



పల్లవి :


నా హృదయపు కోవెలలో....  ఆ... ఆ
నా బంగారు లోగిలిలో....  ఆ...  ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...  ఆ ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే
ఆ...ఆ... హా...

నా హృదయపు కోవెలలో... 


చరణం 1 :


ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో...
సొగసును మించిన సుగుణముతో... నా మనసును నిలువునా దోచితివే

నా హృదయపు కోవెలలో...  



చరణం 2 :




అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే...
లక్ష్మి సరస్వతి నీవేలే... నా బ్రతుకున కాపురముందువులే

నా హృదయపు కోవెలలో...  



చరణం 3 :


ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిథులతో...
వచ్చే పోయే అతిథులతో... మన వాకిలి కళకళలాడునులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... 



No comments:

Post a Comment