చిత్రం : కలియుగ రావణాసురుడు (1980) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సినారె నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నల్లా నల్లని కళ్ళు... నవ్వీ నవ్వని కళ్ళు చుసినట్టే చూసి.. తలుపులు మూసేసుకున్న కళ్ళు నల్లా నల్లని కళ్ళు
చరణం 1 :
తొలిపొద్దులో..ఓ.. ఓ..తామర..కళ్ళు..మ్మ్ మ్మ్ మ్మ్ మలిసందేలో..ఓ.. ఓ..కలువ కళ్ళు..అహహాహాహా ఎటిపాయలో..ఓఓఓ..చేపకళ్ళు..ఊ తోటమలుపులో..ఓ..లేడి కళ్ళు..మ్మ్ ఎన్నాళ్ళు చూసినా..ఆ.. ఎన్నేళ్ళు చూసినా..మ్మ్ మ్మ్ మ్మ్ లోతులందని కళ్ళు.. నా లోకమేలే కళ్ళు ఏమి చక్కని కళ్ళు.. రామ చక్కని కళ్ళు
చరణం 2 :
సిగ్గును చీరగా కప్పుకుని..మ్మ్.. చిలిపిగా ఓరగా కప్పుకుని..మ్మ్ హు చిరు చిరు నవ్వులు ..చుర చుర చూపులు కలియబోసి..ఈఈఈ..ముగ్గులేసి..ఆ హా.. రారమ్మని..ఆహా..పోపొమ్మని..ఆహా..ఇపుడొద్దని .. సరిలెమ్మని ఊరించే కళ్ళు..సరసాలకు శంఖం పూరించే కళ్ళు ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు
చరణం 3 :
ఆవులించే కళ్ళు..మ్మ్..ఆకలేసిన కళ్ళు..మ్మ్ రైక తొడిగిన కళ్ళు.. పైట తొలగిన కళ్ళు..మ్మ్ హు కసిరి వల విసిరి.. వలపు కొసరి కొసరి..ఆ ఆ ఆ మగతను ఎగదోసే కళ్ళు.. మనసును నమిలేసే కళ్ళు ఆ కళ్ళే..ఏ .. ఏ.. నడివేసవి వడగళ్ళు ఆ కళ్ళే.. నా కలల పొదరిల్లు..మ్మ్ మ్మ్ మ్మ్
లోతులందని కళ్ళు.. నా లోకమేలే కళ్ళు..మ్మ్ ఏమి చక్కని కళ్ళు.. రామ చక్కని కళ్ళు
No comments:
Post a Comment