Sunday, February 7, 2016

అడుగుదామని ఉంది నిన్నొక మాట

చిత్రం  :  పెళ్ళిరోజు (1968)
సంగీతం  :  ఎం. ఎస్. శ్రీరామ్
గీతరచయిత  :  రాజశ్రీ
నేపధ్య గానం  : సుశీల,  పి.బి. శ్రీనివాస్






పల్లవి :



అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
తీయరాదా సిగ్గు పరదా.. ఎవరు లేరు కదా..ఆ..


అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే అంత ప్రేమ.. కలిగెనెందుకనీ..ఈ..


అడుగుదామని ఉంది నిన్నొక మాట



చరణం 1 :


పసిదానిగ నటీయించి.. మది దోచావెందులకు?


నేనెవరో తెలియకనే.. నను పిలిచావెందులకు?


ఇది ఏమి గడుసుతనం?...  ఇది ఏమి చిలిపితనం?
కాదు పడుచుతనం.. ఊ.. ఊ..


అడుగుదామని ఉంది నిన్నొక మాట



చరణం 2 :


మన పరిచయమొక కథగా...  జరిగింది మొదటిరోజు


ఆ పరిచయ ఫలితముగా...  పెరిగింది ప్రేమ మోజు


ఏనాటి అనుబంధమో... గతజన్మలో బంధమో


ఎందుకీ స్నేహమో..


అడుగుదామని ఉంది నిన్నొక మాట
పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే అంతప్రేమ... కలిగె నెందుకనీ..ఈ..
అడుగుదామని ఉంది నిన్నొక మాట





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7031

No comments:

Post a Comment