Tuesday, March 1, 2016

ఇది ప్రేమ సామ్రాజ్యం

చిత్రం :  మండే గుండెలు (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు  

పల్లవి :

ఇది ప్రేమసామ్రాజ్యం.. ఇది మన్మధ సామ్రాజ్యం
ప్రతి హృదయం ఒక సింహాసనం.. ఒక రాజు రాణి పఠాభిషేకం

ఇది ప్రేమసామ్రాజ్యం.... 

చరణం 1 :

ఈ జంటలలో మనమొక జంటై... ఒక గంటైనా ఉంటే చాలు
ఈ జంటలకే జేగంటలమై మనముంటాము పది కాలాలు

అందుకే ఉన్నవి పొదరిల్లు... పొదరిల్లకు ఉన్నవి పోకిరి కళ్ళు

ఇది ప్రేమసామ్రాజ్యం.. ఇది మన్మధ సామ్రాజ్యం

చరణం 2 :

ఈ పువ్వులలో జతపువ్వులమై చిరునవ్వులమై ఉందాము
ఈ పచ్చికలో మన మచ్చికలో నులి వెచ్చదనం చూదాము
వెచ్చదనాన్ని తెచ్చాము... అది మెచ్చుకునేందుకే వచ్చాము

ఇది ప్రేమసామ్రాజ్యం.. ఇది మన్మధ సామ్రాజ్యం

చరణం 3 :

చిగురాకులో విరిరేకులలో ఎరుపై నునుపై ఉందాము
బిగి కౌగిలో తొలి మైకములో సగమూ సగమైపోదాము

అందుకే ఉన్నది యవ్వనము... ఈ యవ్వనమందే అనుభవము

ఇది ప్రేమసామ్రాజ్యం.. ఇది మన్మధ సామ్రాజ్యం
ప్రతి హృదయం ఒక సింహాసనం.. ఒక రాజు రాణి పఠాభిషేకం

ఇది ప్రేమసామ్రాజ్యం.. ఇది మన్మధ సామ్రాజ్యం 

No comments:

Post a Comment