Tuesday, March 22, 2016

వెన్నెల్లో.. ఈ నీలాకాశం









చిత్రం :  పండంటి కాపురానికి 12 సూత్రాలు (1983)
సంగీతం :  సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల      





పల్లవి :


వెన్నెల్లో.. ఈ నీలాకాశం
కన్నుల్లో.. ఈ ప్రేమావేశం
మల్లెల్లో.. మన్మధ సందేశం
ఈ మధుమాసం.. మన కోసం..ఊ..ఊ..
ఈ మధుమాసం.. మన కోసం


వెన్నెల్లో.. ఈ నీలాకాశం
కన్నుల్లో.. ఈ ప్రేమావేశం
మల్లెల్లో.. మన్మధ సందేశం
ఈ మధుమాసం.. మన కోసం..ఊ..ఊ..
ఈ మధుమాసం మన కోసం


ఆహహా.. ఆహాహాహాహా..
ఓహొహో.. ఓహోహోహోహో.. 



చరణం 1 : 



హృదయాల మోహం.. అధరాల దాహం
చెలరేగు ప్రాయం.. ఈ యవ్వనం
సెగలైన తాపం.. పగలెల్ల శాపం
ఈ రేయి కోసం.. వేచింది పాపం


చందన చర్చలు శీతల సేవలు వద్దూ..ఊ..
ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు
ఆ.. చందన చర్చలు శీతల సేవలు వద్దూ..ఊ..
ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దూ..


తొలిముద్దులో ఉంది.. తుదిలేని పాశం


వెన్నెల్లో.. ఈ నీలాకాశం
కన్నుల్లో.. ఈ ప్రేమావేశం
మల్లెల్లో.. మన్మధ సందేశం
ఈ మధుమాసం.. మన కోసం..ఊ..ఊ..
ఈ మధుమాసం.. మన కోసం



చరణం 2 :



మనసైన రాగం.. అనువైన తాళం
రచియించు గీతం.. ఈ జీవితం
ఆనంద గానం.. అందాల నాట్యం
సరిపాళ్ల పాకం.. శృంగార లోకం


అంగజు బారికి లొంగని వారలు ఎవరూ..ఊ..
శృంగారంలో నింగిని తాకిందెవరు
ఆ.. అంగజు బారికి లొంగని వారలు ఎవరూ..ఊ..
శృంగారంలో నింగిని తాకిందెవరు


ప్రతిరోజు తుది చూసి.. మిగలాలి శేషం


వెన్నెల్లో.. ఈ నీలాకాశం
కన్నుల్లో.. ఈ ప్రేమావేశం
మల్లెల్లో.. మన్మధ సందేశం
ఈ మధుమాసం.. మన కోసం..ఊ..ఊ..
ఈ మధుమాసం.. మన కోసం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13004

No comments:

Post a Comment