Monday, March 21, 2016

కదిలే కాలమా




చిత్రం :  పెదరాయుడు (1995)
సంగీతం :  కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : ఏసుదాసు, చిత్ర     





పల్లవి :


కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుకా...  కల్లార చూడవమ్మ
పేగే కదలగా... సీమంతమాయెలే  ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ



చరణం 1 : 

లాలించె తల్లీ... పాలించె తండ్రీ... నేనేలె నీకన్ని
కానున్న అమ్మ... నీ కంటి చెమ్మ.. నే చూడలేనమ్మ


కన్నీళ్లలో చెలికాడినే... నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులె


కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుకా...  కల్లార చూడవమ్మ
పేగే కదలగా... సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా...  కాసేపు ఆగవమ్మ 


చరణం 2 : 

తాతయ్య తేజం పెదనాన్న నైజం... కలిసున్న పసిరూపం
నీ రాణి తనము... నా రాచ గుణము.. ఒకటైన చిరుదీపం
పెరిగెనులే నా అంశము.. వెలిగెనులే మా వంశము
ఎన్నెన్నో  తరములు తరగని యశములకు


ఎన్నో  నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా



నడిచే దైవమా... నీ పాద ధూలులే పసుపు కుంకుమలు నాకు
ఎన్నో  నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16042

1 comment:

  1. ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించినది కోటి గారు అనుకుంటాను అండి. సరిచూడగలరు.

    ReplyDelete