Tuesday, March 22, 2016

శ్రీ శారదాంబా నమోస్తుతే

చిత్రం :  శృతిలయలు (1987)

సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  జానకి



పల్లవి :


శ్రీ శారదాంబా నమోస్తుతే...
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...



చరణం 1 :


నాద సాధనే ఆరాధనం... రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం... రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం...  గళపీఠమే రత్న సింహాసనం
సరిగమల స్వరసలిల సంప్రోక్షణం...


శ్రీ శారదాంబా నమోస్తుతే... 



చరణం 2 :


నా గానమే నీరాజనం... నా ప్రాణమే నివేదనం
నా గానమే నీరాజనం...  నా ప్రాణమే నివేదనం
శ్వాసకీవిలా స్వరనర్తనం... శ్వాసకీవిలా స్వరనర్తనం
సంగీత భారతికి సంకీర్తనం 


శ్రీ శారదాంబా నమోస్తుతే... 




వాగీశా వల్లభ.... శ్రీ శారదాంబా...
శ్రిత సరసిజాసన...  స్మిత మంగళానన
శ్రీ శారదాంబా...
సిద్ది ప్రదాయని...  బుద్ది ప్రసాదిని
గీర్వాణి...  వీణాపాణి ... శ్రీ శారదాంబా...
లలిత లయ జనిత .... మృదుల పద గమిత
లలిత లయ జనిత....  మృదుల పద గమిత
కావ్య గాన లోల... శంకర అచ్యుతాది .. సకల తిమిర సన్నుత


శ్రీ శారదాంబా నమోస్తుతే...సంగీత సాహిత్య మూలాకృతే..
శ్రీ శారదాంబా నమోస్తుతే...నమోస్తుతే... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13110

No comments:

Post a Comment