Sunday, March 20, 2016

నా పాట పంచామృతం

చిత్రం :  అల్లరి మొగుడు (1990)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు

పల్లవి :

నా పాట పంచామృతం ...
నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం ... 

చరణం 1 :

వల్లకి మీటగ పల్లవపాణి... అంగుళి చేయనా పల్లవిని
వల్లకి మీటగ పల్లవపాణి... అంగుళి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి... చరణములందించనా

నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం ... 

చరణం 2 :

గళము కొలను కాగా... ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా... విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై...  స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం....  సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమకగతులు సాగ
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ... 

నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం ... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16027

No comments:

Post a Comment