Saturday, March 19, 2016

ఉంగరం పడిపోయింది

చిత్రం : సుజాత (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి : 


ఉంగరం పడిపోయింది... పోతే పోనీ.. పోతే పోనీ
కొంగు జారీ పోతోంది... పోతే పోనీ.. పోతే పోనీ 


పోతే పోనీ అంటావా... నాతోనే నువ్వు అంటావా
ఉంగరం పడిపోయినా.. కొంగుజారి పోయినా
హృదయం మాత్రం పదిలం పదిలం




చరణం 1 :



పూల కోసం తోటకెళ్ళితే... పొగరు తుమ్మెదా పై పై బడితే
పూలను మరచి తోటను విడిచి.. ముళ్ళ కంచెలే నువ్వు దాటొస్తే



చీరేమో చిరిగింది... పోతే పోనీ
కాలేమో బెణికింది... అహ.. పోతే పోనీ 


హా.. చీర చిరిగిపోయినా.. కాలు బెణికిపోయినా
పరువం మాత్రం పదిలం పదిలం




చరణం 2 :



నీటి కోసం ఏటికెళ్ళితే... కొరమీనూ గోరు కొరికితే
నీటిని మరచి.. ఏటిని విడిచి.. చెట్టుపుట్ట నువ్వు దాటొస్తే



కోడెగిత్త కుమ్మింది... పోతే పోనీ
లేతబుగ్గ కందింది.. పోతే పోనీ 


ఏయ్... కోడెగిత్త కుమ్మినా.. లేతబుగ్గ కందినా
ఒళ్లు మాత్రం పదిలం పదిలం



చరణం 3 :


పండువెన్నెల్లో పడుకొని ఉంటే... పాడునిద్దరే పగబడుతుంటే
గుండెకు బరువై... కంటికి ఎరుపై... పండువెన్నెలే సెగలైపోతే


నీ రూపే నిలిచింది... ఉండిపోనీ
నీ తలపే నిండింది... ఉండిపోనీ
నిండిన నీ తలపే... ఉండిన నీ రూపే
నీ గుండె బరిణెలో పదిలం పదిలం


ఉంగరం పడిపోయింది... పోతే పోనీ.. పోతే పోనీ
కొంగు జారీ పోతుంది... పోతే పోనీ..ఉహు..ఉహు.. 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=16001

No comments:

Post a Comment