Wednesday, March 16, 2016

మల్లి విరిసింది

చిత్రం :  రామయ్య తండ్రి (1975)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  మల్లెమాల

నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది

మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది

ఎన్నో ఏళ్ళకు మా ఇంట.. ఎన్నో ఏళ్ళకు మా ఇంట

పండినది ఈ నోముల పంట..ఆ ఆ ఆ ఆ 

మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది 



చరణం 1 :



ముద్దు ముచ్చట మూట గట్టుకొని వచ్చాడు

ఆ మురిపాలన్ని అందరికి పంచిస్తాడు

ముద్దు ముచ్చట మూట గట్టుకొని వచ్చాడు

ఆ మురిపాలన్ని అందరికి పంచిస్తాడు 


కోదండరాముని కోండంత దయ వలన

కోదండరాముని కోండంత దయ వలన

కొత్త పెత్తందారు నేడు వెలిసాడు


మల్లి విరిసింది.. పరిమళపు జల్లు కురిసింది  


 

చరణం 2 :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఏడాదికేనాల్గుగేళ్లు  రావాలీ 

మా బాబు ఎప్పటికి ముప్పైన ఉండిపోవాలీ  

ఏడాదికేనాల్గుగేళ్లు  రావాలీ 

మా బాబు ఎప్పటికి ముప్పైన ఉండిపోవాలీ 

తనువిచ్చి ప్రేమతో కనిపెంచుకొన్నా

తనువిచ్చి ప్రేమతో కనిపెంచుకొన్నా

తల్లితండ్రులకు తానే తల్లి కావాలీ... తండ్రి కావాలీ


 

మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది

మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది

ఎన్నో ఏళ్ళకు మా ఇంట... ఎన్నో  ఏళ్ళకు మా ఇంట

పండినది ఈ నోముల పంట.. ఆ.. ఆ.. ఆ.. ఆ 

మల్లి విరిసింది... పరిమళపు జల్లు కురిసింది 




No comments:

Post a Comment