Wednesday, March 16, 2016

గోరంత దీపం... కొండంత వెలుగు



చిత్రం :  గోరంత దీపం (1978)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


గోరంత దీపం...  కొండంత వెలుగు
చిగురంత ఆశ...  జగమంత వెలుగు
గోరంత దీపం...  కొండంత వెలుగు
చిగురంత ఆశ...  జగమంత వెలుగు



చరణం 1 :


కరిమబ్బులు కమ్మే వేళ.. మెరుపు తీగే వెలుగూ
కారు చీకటి ముసిరే వేళ.. వేగు చుక్కే వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు



మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మద్యన సహనమే వెలుగు
ఆహా....ఆ.. ఆ.. ఆ.. ఆ.... ఆ...ఆ.. ఆ... ఆ


గోరంత దీపం...  కొండంత వెలుగు..
చిగురంత ఆశ...  జగమంత వెలుగు..


చరణం 2 :



కడలి నడుమ పడవ మునిగితే... కడదాకా ఈదాలి
కడలి నడుమ పడవ మునిగితే... కడదాకా ఈదాలి


నీళ్ళు లేని ఎడారిలో..ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ
నీళ్ళు లేని ఎడారిలో...  కన్నీళ్ళైనా తాగి బతకాలి..
నీళ్ళు లేని ఎడారిలో... కన్నీళ్ళైనా తాగి బతకాలి..


ఏ తోడు లేని నాడు... నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేని నాడు... నీ నీడే నీకు తోడు
జగమంతా దగా చేసినా...  చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ...  జగమంత వెలుగు..

గోరంత దీపం...  కొండంత వెలుగు..
చిగురంత ఆశ...  జగమంత వెలుగు..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4708

No comments:

Post a Comment