Wednesday, March 9, 2016

రేవులోన చిరుగాలి

చిత్రం : పసుపు పారాణి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా ..  చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ .. చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి

రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

చరణం 1 :

జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట చదరంగం ఆడుతోంది
జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది

జలదరించి పై పెదవి చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా...  బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా...  బాసికాలు కట్టిద్దామా

రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది.. రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది.. ఒళ్ళు విరుచుకుంటోంది 

చరణం 2 :

ఈ కళ్ళతో ఆ కళ్ళు గస్తీలు కాస్తున్నాయి
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నాయి
ఆ కళ్ళతో ఈ కళ్ళు గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు విస్తళ్ళు వేస్తున్నయ్

మురిపించే ఆ పలుకులు స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా... తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా...  తొలివలపులు పండిద్దామా

రేవులోనా  చిరుగాలి రెక్కలార్చుకుంటోంది... రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది.. ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం ఒళ్ళు విరుచుకుంటోంది

No comments:

Post a Comment