Sunday, April 10, 2016

అందగాడా అందవేరా



చిత్రం :  రాజు-రాణి-జాకి (1984)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి  



పల్లవి  :



అందగాడా అందవేరా...  అందమంతా అందుకోరా
అలిగి తొలగి జరిగిపోకు సందెకాడ
కరిగిపోతె తిరిగిరాదు కౌగిలింత
చెంతకొచ్చి చింత తీర్చరా
తోడు రాకుంటె ఈడు ఎందుకంట?
తోడు రాకుంటె ఈడు ఎందుకంట?



అందగాడా అందవేరా...  అందమంతా అందుకోరా
అలిగి తొలగి జరిగిపోకు సందెకాడ 



చరణం 1 :


గుండె గుబులుతో కునుకు పట్టదు
జాబిల్లి ఎండ కన్ను కొట్టిపోతది
ముద్దు తీరక ముద్ద ముట్టదు
నా కన్నె ఈడుకున్న కొత్త ఆకలి



గుండె గుబులుతో కునుకు పట్టదు
జాబిల్లి ఎండ కన్ను కొట్టిపోతది
ముద్దు తీరక ముద్ద ముట్టదు
నా కన్నె ఈడుకున్న కొత్త ఆకలి
చక్కిలి గిలి పుడుతోంది మళ్ళీ మళ్ళీ


అమ్మదొంగా అందుతానా..
నా సామిరంగా... లొంగుతానా
అసలు సిసలు రంగు తెలిసే సందేకాడా
సరసజేరి సరసమేలా మాపటేలా



కోల కళ్ళ కోమలాంగిరో..
తోడు నువ్వుంటే ఈడు దండగంట
తోడు నువ్వుంటే ఈడు దండగంట



అమ్మదొంగా అందుతానా..
నా సామిరంగా... లొంగుతానా
అసలు సిసలు రంగు తెలిసే సందేకాడా
సరసజేరి సరసమేలా మాపటేలా




చరణం 2 :


తొండ ముదిరితే ఊసరవెల్లి
ఏ రంగుకు ఆ రాగం అందుకుంటది
రూపు మారితే చూపు మారదు
ఆ మనసుకు ఈ మనసే అద్దమౌతది...



తొండ ముదిరితే ఊసరవెల్లి
ఏ రంగుకు ఆ రాగం అందుకుంటది
రూపు మారితే చూపు మారదు
ఆ మనసుకు ఈ మనసే అద్దమౌతది...
తిక్క కుదిరిపోయందా హళ్ళీ హళ్ళీ 


అమ్మదొంగా అందుతానా..
నా సామిరంగా... లొంగుతానా
అసలు సిసలు రంగు తెలిసే సందేకాడా
సరసజేరి సరసమేలా మాపటేలా



కోళ కళ్ళ కోమలాంగిరో..
తోడు నువ్వుంటే ఈడు దండగంట
తోడు నువ్వుంటే ఈడు దండగంట

అందగాడా అందవేరా...  అందమంతా అందుకోరా
అమ్మదొంగా అందుతానా..
అలిగి తొలగి జరిగిపోకు సందెకాడ
అసలు సిసలు రంగు తెలిసే సందేకాడా





No comments:

Post a Comment