Monday, April 4, 2016

మీ పల్లే వ్రేపల్లెగా

చిత్రం :  అమ్మాయి మనసు (1987)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు

పల్లవి :

ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ
హా ఆ ఆ... హా హా ఓ హో.. ఆ ఆ ఆ హా ఆ ఆ .. ఆ ఆ
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
పిలిచింది నన్నే బృందావని.. పరదేశిననా రారమ్మని
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా

చరణం 1 :

నెమిలమ్మకు సిరిమువ్వలే కరిమబ్బుల నీడలోనా.. తొడగాలని కోరుకున్న
కుహూ అమ్మకు పులకింతగా మావి చిగురించు వేళ.. పూదండలే అల్లుకున్న 

గుబురైన కొమ్మని... కుదురైన గూడుగా
గుబురైన కొమ్మని... కుదురైన గూడుగా
కోరింది గోరింట

ఓ.. ఓ.. ఓ..
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
పిలిచింది నన్నే బృందావని.. పరదేశిననా రారమ్మని
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా

చరణం 2 :

మలిసందెల తిలకాలతో అందాల తొలి పూజ చేసి... మరి వెళ్ళాడే బాటసారి
అల ఆడగా.. సెల పాడగా.. నా ఊహ ఊయలలూగి మరిపించనా పాట పాడి

సన్నాయి సొగసుల... అమ్మాయి మనసులా
సన్నాయి సొగసుల... అమ్మాయి మనసులా
సురపొన్నలే పూయగా

ఓ.. ఓ.. ఓ..
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
పిలిచింది నన్నే బృందావని.. పరదేశిననా రారమ్మని
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
నీ గోము గోపెమ్మగా... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5069

No comments:

Post a Comment