Wednesday, April 6, 2016

లేత చలిగాలులూ




చిత్రం :  మూడుముళ్ళు (1983)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత : జ్యోతిర్మయి
నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా
చలి వెలుగూ వెన్నెలలూ నిను తాకగా తగవురా


లేత చలిగాలులూ..హోయ్..దోచుకోలేవులే
మన వలపూ వాకిలినీ అవి తాకగా లేవులే


లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా




చరణం 1 :



అందాల నా కురులతో వింజామరలు వీచనా..
అందాల నా కురులతో వింజామరలు వీచనా..
రాగం..భావం..స్నేహం..మోహం..నిన్నే వేడనా


నీ కురుల వీవెనలకు నా హృదయమర్పించనా..
రూపం..దీపం..శిల్పం..నాట్యం..నీలో చూడనా
కనుల భాష్పాలు..ఆ..హా..
కలల భాష్యాలు..ల ల లా ఒ హో ఓ
వలపులా సాగి..వలలుగా మూగి... కాలాన్ని బంధించగా


లేత చలిగాలులూ..హోయ్..దోచుకోరాదురా
చలి వెలుగూ వెన్నెలలూ నిను తాకగా తగవురా
లేత చలిగాలులూ..అహహ..దోచుకోలేవులే





చరణం 2 :



అధరాల కావ్యాలకూ ఆవేశమందించనా
అధరాల కావ్యాలకూ ఆవేశమందించనా
వలపే పిలుపై..వయసే ముడుపై..నిన్నే చేరనా


మందార ముకుళాలతో పాదాలు పూజించనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై..కలనై..విరినై..ఝరినై..నిన్నే కోరనా
హృదయనాదాల..ఆ..హా..
మధురరాగాల..ఆహహ..ల ల లా
చిగురు స్వరసాల... నవవసంతాల...  విరులెన్నో అందించగా


లేత చలిగాలులూ...హోయ్...దోచుకోలేవులే
మన వలపూ వాకిలినీ అవి తాకగా లేవులే
ఆ హ హా..హా..హో..మ్మ్..మ్మ్..మ్మ్..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5088

1 comment: