Monday, April 4, 2016

ఒక వేణు గీతం



చిత్రం :  అమ్మాయి మనసు (1987)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపథ్య గానం :  బాలు


పల్లవి :

హా.. ఆ.. ఆ.. హా
ఆ.. ఆ.. ఆ.. హో..ఓ.. ఓ..
లాలలాలలా... ఆ.. హా 


ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో


చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..

ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో




చరణం 1 :



అలలై బంగారు కలలై...  మిగిలే అందాలు కొన్ని
వనవాటిలో సెలయేటిలాగ నను తొందరించసాగే


ఎదలో ఏ మూలలోనో...  కదిలే భావాలు కొన్ని
నా గుండె నుంచి... లోగొంతు నుంచి... నా పెదవి పైకి చేరే
లాలించే పాటలాగా.. హో



ఒక వేణు గీతం....  పలికింది పాటై
ఎద పల్లవించగా....  ఈవేళ నాలో




చరణం 2 :



హృదయం కోరేది స్నేహం.. స్నేహం నూరేళ్ళ దీపం
మనసున్న మనిషి తోడైన వేళ... నీదే అందాల లోకం


ప్రణయం వసంతమైతే... బ్రతుకే పూదోట కాదా
మనసులో మాట చూపులో తెలిసే.. ఎందుకో ఇంక మౌనం
ఆ మౌనం ప్రేమ భాష్యం... ఊ...



ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో


చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..

ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5068

1 comment: