Tuesday, April 26, 2016

తూలే తూలే తూలేనమ్మ







చిత్రం : జననీ జన్మభూమి (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆ..
తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ


తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..




చరణం 1 :



నడిచి నడిచి రావయ్య నందీవాహనా..
అలసిసొలసి పోకయ్య అందెల బసవన్న
నడిచి నడిచి రావయ్య నందీవాహనా..
అలసిసొలసి పోకయ్య అందెల బసవన్న


నడయాడే ఆ గంగ బిడియాన పిలవంగ
నడయాడే ఆ గంగ బిడియాన పిలవంగ


వారణాసి నదులు నీ కాళ్ళు కడగంగ
నందీవాహనా... హా..హా.. గౌరీమోహనా
నందీవాహనా...   గౌరీమోహనా


తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ 





చరణం 2 :



పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి...
వంక పెట్టి తలకెక్కే నెలవంకే తుళ్లి
పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి...
వంక పెట్టి తలకెక్కే నెలవంకే తుళ్లి


అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగా
అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగా


కాశీ విశాలాక్షి కండ్లే కలువాలవ్వంగా 



నందీవాహనా... హా..హా.. గౌరీమోహనా
నందీవాహనా... గౌరీమోహనా


తూలే తూలే తూలేనమ్మ తూనీగ నడుము..
గు..గు..గూ.... గు..గు..గూ
తేలే తేలే తేలేనమ్మ తేనీగ కళ్ళూ..
గు..గు..గూ.... గు..గు..గూ 


ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ..ఆ ఆ. ఆ.ఆ..ఆ.. ఆ..ఆ









http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10262

1 comment: