Saturday, April 9, 2016

వనిత..లత..కవిత..

చిత్రం :  కాంచన గంగ (1984)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి 

నేపధ్య గానం :  బాలు 




పల్లవి :


వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..


వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..


ఇవ్వాలి చేయూత ..
మనసివ్వడమే మమత... మనసివ్వడమే మమత


వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..



చరణం 1 :



పూలురాలి నేలకూలి... తీగబాల సాగలేదు..
చెట్టులేక... అలుకోక... పూవు రాదు నవ్వలేదు
మోడు మోడుని తిట్టుకున్నా... తోడు విడిచేనా??
పులకరించే... కొత్త ఆశ  తొలగిపోయెనా?



వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..



చరణం 2 :




ఆదరించే ప్రభుతలేక... కావ్యబాలా నిలువలేదు..
కవిత ఐనా... వనిత ఐనా... ప్రేమలేకా పెరగలేదు..
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా??
చేదు మింగి... తీపి నీకై పంచమరిచేనా??

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..


చరణం 3 :


తనది అన్న..గూడులేక కన్నెబాల బతకలేదు..
నాది అన్న తోడులేక... నిలువలేదు విలువలేదు
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా??
వెలుగులోన... నీడలోన నిన్ను మరిచేనా..



వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..



ఇవ్వాలి చేయూత ..
మనసివ్వడమే మమత... మనసివ్వడమే మమత


వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..



No comments:

Post a Comment