Sunday, April 17, 2016

దేవతలందరు ఒకటై వచ్చి

చిత్రం :  ధర్మాత్ముడు (1983)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి : 


దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి


నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం

దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి 


నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి
నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం





చరణం 1 :



గాజులేసి గంధం పూసి.. దిష్టి బొట్టు బుగ్గన పెట్టి
హారతీయరారే... పాట పాడ రారే


మీ అందరు ఆశీస్సులే రామరక్ష జీవితాన
ఎన్నటికీ పాపవమ్మా కన్నవారి కళ్ళలోనా
మా ప్రాణం.. మా ధ్యానం.. మా సర్వం నీవేనమ్మ




ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం




దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి


నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం




చరణం 2 :



చిట్టి తల్లి కడుపున మోసే... చిన్ని నాన్న ఎంతటి వాడో
రామచంద్రుడో... బాలకృష్ణుడో


తాత పేరు నిల్కంటికి వెలుగిచ్చే దీపమై
వెలగాలీ ఏనాడు ని కడుపున పెట్టెవాడు



ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం




దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి


నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం









No comments:

Post a Comment