Tuesday, April 19, 2016

నెలరాజా..ఇటు చూడరా





చిత్రం : సూర్య IPS (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర  



పల్లవి :



ఓ.. ఓ.. ఓ.. ఓ...
నెలరాజా..ఆ.. ఇటు చూడరా
నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
తగువేళరా ..తగవేలరా ..రవితేజా 


నవరోజా..ఆ.. తెర తీయవా..
నవరోజా..ఆ.. తెర తీయవా..





చరణం 1 : 




నీ కోసం ఆశగా నిరీక్షించె ప్రాణం..
నీ చెతుల వాలగా చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా చలించింది పాదం..
నీ రూపే దీపమై ప్రయాణించె జీవం


నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా..ఆ..
నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా..ఆ..

రతిరాజువై జతచేరవా..
విరివానవై ననుతాకవా..


నవరోజా..ఆ.. తెర తీయవా..
నవరోజా..ఆ.. తెర తీయవా..
దివితారక తవితీరగా నినుచూచా
జవనాలతో జరిపించవే జతపూజా


నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
నెలరాజా..ఆ.. ఇటు చూడరా..



చరణం 2 :




ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని..
ఈ స్నేహం జంటగా జగాలేలుకోని
నీ కన్నులపాపగా కలలొ ఆడుకోని ..
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని


ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించనీ ..
దిగంతాల తారల కోట ప్రవేశించనీ
గతజన్మనే.. బ్రతికించనీ..
ప్రణయాలలో.. శృతి పెంచనీ


నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
నవరోజా..ఆ.. తెర తీయవా..


ఉలుకేలరా కులుకేలరా వలరాజా
జవనాలతో జరిపించవే జతపూజా


నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
నవరోజా..ఆ.. తెర తీయవా..






No comments:

Post a Comment