Friday, April 15, 2016

బుజ్జిపాప బుల్లిపాప







చిత్రం : పులిబిడ్డ (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :



ఒచ్చొలొల్లొల్లొల్లల్ల హాయి...
బుజ్జిపాప బుల్లిపాప బోజ్జనిండా పాలు తాగి పండుకోమ్మా
చంటిపాప కొంటే పాప అల్లరింక చాలుగాని నిద్దరోమా
ఒచ్చొలొల్లొల్లొల్లల్ల హాయి... 




బుజ్జిపాప బుల్లిపాప బోజ్జనిండా పాలు తాగి పండుకోమ్మా
చంటిపాప కొంటే పాప అల్లరింక చాలుగాని నిద్దరోమా 




చరణం 1 :



బస్కీల వీరా.. కుస్తీకుమారా..
ఉంగా ఉంగా ఉగ్గుపడతారా రారా
ఆ సాములేరా.. నా సామి రారా
టింగురంగా సిగ్గుపడతావేరా


గిల్లి జోల్లల్లు నే పాడనా..
తల్లి ముద్దుల్లో నే ముంచనా


కోపమొచ్చినా తాపమొచ్చినా ధూపమెయ్యనా
చిట్టినాయనా బొడ్దుకొయ్యనా పేరు పెట్టనా
నిద్దరోమా... నిద్దరోమా 



ఒచ్చొలొల్లొల్లొల్లల్ల హాయి...

బుజ్జిపాప బుల్లిపాప బోజ్జనిండా పాలు తాగి పండుకోమ్మా
చంటిపాప కొంటే పాప అల్లరింక చాలుగాని నిద్దరోమా





చరణం 2 :



వ్యాయామ భీమా వస్తాదు సోమా
దండాలెడతా దండాలింక ఆపరా
పరదాల పాపా.. పొరిగింటి దీపా
ఆరాటాలు ఆయాసాలు మానరా


బుజ్జిగా లాల నే పొయ్యనా
వెచ్చగా చిచ్చి నే కొట్టనా


కాలు విరిగినా... కీలు విరిగినా కాపుకాయనా
ముష్టినాయనా.. దిష్టి తీయనా
నిద్దరోమా.. నిద్దరోమా


ఒచ్చొలొల్లొల్లొల్లల్ల హాయి...

బుజ్జిపాప బుల్లిపాప బోజ్జనిండా పాలు తాగి పండుకోమ్మా
చంటిపాప కొంటే పాప అల్లరింక చాలుగాని నిద్దరోమా 







No comments:

Post a Comment