Friday, April 29, 2016

తద్ధిమి తకఝణు

చిత్రం :  బందిపోటు విప్లవ సింహం (1982)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  జానకి

పల్లవి :

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా 

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా

ఓహోహో.. ఓహోహో.. ఆహాహా.. ఆహాహా..
సుక్కలన్ని సోకులు మీరే...  సందమామ పక్కకు సేరె
సుక్కలన్ని సోకులు మీరే...  సందమామ పక్కకు సేరె
చక్కనైన వేళా... ఆ... ఆ

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా

ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 

చరణం 1 :

సిటికంత లేత నడుము ఊగిపోతుంటే

సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే

సిటికంత లేత నడుము ఊగిపోతుంటే

సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే

చల్లగాలి శ్రుతిగా...  చక్కని పిల్లదాని జతగా

చల్లగాలి శ్రుతిగా...  చక్కని పిల్లదాని జతగా

అల్లన మెల్లన గుండెలు ఝల్లన ఆడవోయి మావ

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా

ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 

చరణం 2  :

ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది
ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది

కన్నెపిల్ల ఇదిగో...  వెన్నెల గోరుముద్దలవిగో
కన్నెపిల్ల ఇదిగో...  వెన్నెల గోరుముద్దలవిగో
చల్లగ మెల్లగ సరసాలాడుతూ ఆరగించు మావా

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా...  కనువిందు సెయ్యి మావా

ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 

ఓహో హో ఓహో హో... ఆహా హా.. ఆహా.. హా... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9906

No comments:

Post a Comment