Wednesday, April 20, 2016

పావురానికి పంజరానికి

చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు    

పల్లవి :

పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం

కొడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ... 

చరణం 1 :

తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను

చేసిన పాపములా ... ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ... ఇది దేవుని శాసనమా .. ఇది తీరేదే కాదా

పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం
కొడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ... 

పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం

చరణం 2 :

తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్లికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం .. నా మీద నాకేలే కోపం

నా తొలి నేరములా .. ఇవి తీరని వేదనలా
నా మది లోపములా .. ఇవి ఆరని శోకములా .. ఇక ఈ బాధే పోదా

పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం
కొడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ... 

పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11033

No comments:

Post a Comment