Sunday, April 17, 2016

ఎంత కులుకు ఎంతో ఉలుకు


చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి :



ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు


ఎంత ఉడుగు... ఎంతో దుడుకు... హొయ్.. హొయ్.. హొయ్
చిరుగాజులు చిట్లే వరకు... హొయ్.. హొయ్.. హొయ్


ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
లలల్లా.. లలల్లా



చరణం 1 :



చలికాలం వచ్చిందంటే... చెలి కౌగిలి ఇచ్చిందంటే
మనసనేది సొద పెడుతుంటే... వయసు సొగసు ముడిపడుతుంటే



విడి విడిగా ఉండలేక... తడబడుతూ సాగలేక
విడి విడిగా ఉండలేక... తడబడుతూ సాగలేక


ఒకరిలోన ఒకరొదిగి అతికి బ్రతికి పోతుంటే
లలల్లలల్లా... హోయ్.. లలల్లలలా




ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు





చరణం 2 :



ముసురసలే పడితే గిడితే... కసిగా కోరిక బుసకొడితే
పడుచు పైట గొడుగే పడితే... ఆ గొడుగులోన ఇరుకున పడితే


తహతహలో ఆగలేక...  తడిగాలికి సాగ లేక
గొడుగు గాలికికెగిరిపోయి... గొడవ  ముదిరిపోతుంటే
లలలలల్లా... లలలలల్లా




ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు



ఎంత ఉడుగు... ఎంత దుడుకు
చిరుగాజులు చిట్లే వరకు


ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
లలల్లా.. లలల్లా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4038

No comments:

Post a Comment