Sunday, April 3, 2016

మల్లీ మల్లీ..నా నాగ మల్లీ

చిత్రం :  నాగమల్లి (1980)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి : 


మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..


మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ 





చరణం 1 :




ఆషాఢ మాసాన...మిల మిలమన్నా
మెరుపే చూసి... నీవనుకున్నా..ఆ ఆ ఆ ఆ ఆ
కార్తీక దీపాల కాంతులలోనా... కళలే చూసి నీవనుకున్నా
ఆరారు రుతువుల ఆలాపనగా... కనులే తెరచి నే కలలే కన్నా


మా మ్మ మా మ్మ మమ..మా మ్మ మా మ్మ మమ..రిరినిస్సాస్స
కాల మేఘములు..కామ దాహములు..కరిగినా మధుర గీతం
ససమమమమ రిరిదదదద మమమనీనినీ సాస్సా...
నిను నను కల్పిన నిముషము వలపున యుగయుగాల సంగీతం..


తనువు నీ వేణువే... మనసు నీ రాగమే..మల్లి నీ కోసమే


మల్లీ మల్లీ... నా నాగ మల్లీ
మల్లీ మల్లీ... నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మల్లీ మల్లీ... నా నాగ మల్లీ
మల్లీ మల్లీ... నా నాగ మల్లీ 



చరణం 2 :




మధుమాసంలో కుహు కుహుమన్నా
పిలుపే విని నీ కబురనుకున్నా.. ఆ ఆ ఆ ఆ
 వైశాఖ మాసాన వేసవిలోనా
వడగాలులు నీ ఉసురనుకున్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా
నను నే మరచీ నీ కౌగిట ఉన్నా


మదమరాళి నీ పద నివాళికై తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై... చందమామ నీ వదనమై..
సిరులు మువ్వలై... గిరులు నవ్వులై... ఝరులు నడకలై..
అరెరెరెరెరె అల్లన మెల్లన పిల్లన గ్రోవికి
ఆరవ ప్రాణము నీవుగా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలిరా శిల్పమై... ఆ ఆ ఆ ఆ
సంగీతమై నాట్యమై... ససస మమమ దదద నినిని రిరిరి 


కదలిరా శిల్పమై... సంగీతమై..నాట్యమై
కలసిపో నీవుగా... నేను నీ మేనుగా
నీవే... నేనుగా.......


మల్లీ మల్లీ... నా నాగ మల్లీ
మల్లీ మల్లీ... నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..


మల్లీ మల్లీ... నా నాగ మల్లీ
మల్లీ మల్లీ... నా నాగ మల్లీ





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5124

No comments:

Post a Comment