Sunday, April 17, 2016

ఒరేయీ.. పిచ్చి సన్నాసి






చిత్రం : మనవూరి పాండవులు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు




పల్లవి :



ఓరే............య్
ఒరేయీ..ఈ..ఈ పిచ్చి సన్నాసి..
ఒరేయీ...ఈ..ఈ..పిరికి సన్నాసి..


ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి
ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి
ఉన్న ఊరు కన్నతల్లి.. ఒరే ఒరే మరువకురా..
నమ్ముకున్న సొంత ఊరు..వెన్నునోల పొడవకురా..ఆ..ఆ..ఆ



ఒరేయీ..ఈ..ఈ పిచ్చి సన్నాసి.. 




చరణం 1 :



మొఖం మీద కోపంతో ముక్కు కోసుకొంటారా?
ఏలు మీద కురుపు వుందని కాలు కోసుకొంటారా?
మొఖం మీద కోపంతో ముక్కు కోసుకొంటారా??
ఏలు మీద కురుపు వుందని కాలు కోసుకొంటారా?



ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా..
ఆవేశం నీ తెలివిని చంపుతుందిరా..
ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా..ఆ..ఆ..ఆ..



ఒరేయీ..కుర్రసన్నాసి..చూసుకో ఒక్కసారి నీకేసి... 




చరణం 2 :



ఈ నీరు ఈ గాలీ ఈ నేల నీదిరా..
ఊరిలోన ప్రతి ఒక్కరు నీ సుట్టం..నేస్తం రా...
ఈ నీరు ఈ గాలీ ఈ నేల నీదిరా..
ఊరిలోన ప్రతి ఒక్కరు నీ సుట్టం..నేస్తం రా... 



ఆశపెట్టుకొన్నోళ్ళను అన్నాయం సేయకురా..
ఆశపెట్టుకొన్నోళ్ళను అన్నాయం సేయకురా..
అన్నాయం సేసినోడి ఆటలు కట్టించరా..




చరణం 3 :



మమత తెంచుకున్నవోడు..మనిసి కాడురా..
మడిసైతే దేనికైనా దడిసిపోడురా..
మమత తెంచుకున్నవోడు..మనిసి కాడురా..
మడిసైతే దేనికైనా దడిసిపోడురా..



ఐదు వేళ్ళు కలిసి వుంటే..చేతి దెబ్బ గట్టిదిరా..
పిడికిలి బిగియించరా...పిడుగులు కురిపించరా..
రా..రారా......  రా... రా..ఆ..ఆ..ఆ..



ఒరేయి..పిచ్చి సన్నాసి..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4027

No comments:

Post a Comment