Sunday, May 1, 2016

అందగత్తె ఆటకేమో వందనాలు






చిత్రం : గూండా (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


హోయ్.. అందగత్తె ఆటకేమో వందనాలు... హా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. అహా.. 


అరే.. అందగత్తె ఆటకేమో వందనాలు... అహా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. అహా.. 


చిరునవ్వు నవ్వితే చిచ్చేలే లోకము
ఒకసారి ఆడితే వన్స్ మోరు

హా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... 


అహా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... అహా...


దరువేసే వాటము దడపుట్టే తాపము
వందసార్లు ఆడినా వన్స్ మోరు 




చరణం 1 :



వన్నెలు చూస్తుంటే కన్నులు కుట్టాలా
చూసిన కళ్ళల్లో చుక్కలు పుట్టా
లా


హోయ్.. ఒంటిలోని ఊపుల్లో.. ఓరకంటి చూపుల్లో
ఒంటిలోని ఊపుల్లో.. ఓరకంటి చూపుల్లో
నల్లమబ్బు లేకుండా మెరుపులెన్నో రావాలా


వాటేసే ఆటల్తో వయ్యరాలే తాకాలా
పడుచోళ్ళ కళ్ళల్లో కలలెన్నో రావాలా
పడకిళ్ళ దిళ్ళల్లో కలహాలే రేగాలా



అహా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... అహా 



అరెరే.. చిరునవ్వు నవ్వితే చిచ్చేలే లోకము
ఒకసారి ఆడితే వన్స్ మోరు




చరణం 2 :



వేసే తాళాలే వెర్రిగ మారాలా
హోయ్.. వచ్చే మైకంలో వయసు ఊగాలా 


రాజసాల నవ్వుల్లో రాజహంసనడకల్లో
రాజసాల నవ్వుల్లో రాజహంసనడకల్లో
ఎండకన్ను పడకుండా కొండమల్లి పూయాలా


కందే నీ పాదాల్లో మందారాలే రాలాలా
నే వలచి వస్తుంటే మైమరచి పోవాలా
కను మెచ్చి చూస్తేనే కలలాగా తోచాలా 




హోయ్.. అందగత్తె ఆటకేమో వందనాలు... హా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. హొయ్..హోయ్ .. 


అరే.. అందగత్తె ఆటకేమో వందనాలు... అహా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. అహా.. 


చిరునవ్వు నవ్వితే చిచ్చేలే లోకము
ఒకసారి ఆడితే వన్స్ మోరు 


అహా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... అహా


దరువేసే వాటము దడపుట్టే తాపము
వందసార్లు ఆడినా వన్స్ మోరు 








No comments:

Post a Comment