Thursday, May 5, 2016

కలిసిపో నా కళ్ళలో




చిత్రం :  చట్టానికి కళ్ళు లేవు (1976)
సంగీతం :  కృష్ణ-చక్ర
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల  



పల్లవి :


కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో


కోరికలెదురై తొందరపెడితే బదులేమివ్వాలి
అంతకు ముందే నువ్వూ నేనూ ఒకటని చెప్పాలి 


కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో




చరణం 1 :



ఒంటిగ ఉంటే తుంటరి గాలి అల్లరి పెడుతోంది
పైటను లాగి పాపిడి రేపి ఆరడి పెడుతోంది
ఒంటిగ ఉంటే తుంటరి గాలి అల్లరి పెడుతోంది
పైటను లాగి పాపిడి రేపి ఆరడి పెడుతోంది



గాలికి కూడా చోటే ఈయని కౌగిలి ఒకటుంది
వలచిన వారికి వాకిలి తెరిచి స్వాగతమిస్తుంది.. స్వాగతమిస్తుంది



కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో




చరణం 2 :



అరఘడియైనా విడవకు నన్ను దణ్ణం పెడతాను
పెదవులు కలిపి ఏం చేయమన్న ముద్దుగ చేస్తాను
అరఘడియైనా విడవకు నన్ను దణ్ణం పెడతాను
పెదవులు కలిపి ఏం చేయమన్న ముద్దుగ చేస్తాను



ఆశకు కూడా హద్దొకటుంది.. పొద్దూ ఒకటుంది
ఏ ముద్దైనా గుట్టుంటేనే ముద్దుగ ఉంటుంది... ముద్దుగ ఉంటుంది



కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో


కోరికలెదురై తొందరపెడితే బదులేమివ్వాలి
అంతకు ముందే నువ్వూ నేనూ ఒకటని చెప్పాలి


కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9608

No comments:

Post a Comment