Wednesday, June 1, 2016

ఆకేసి.. పీటేసి

చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: జ్యోతిర్మయ్
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి :

ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
ఏకంగా రమ్మంటే లగ్గానికి...  ఏపాటి దమ్ముంది పోరగాడికి

చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
కన్నెత్త చెదిరేటి సింగారాలు .. కసికసిగా కాజేస్తా వయ్యారాలు
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి

చరణం 1 :

ఓరకళ్ళ తోటకెళ్లి.. ఎళ్లి...
దోరపళ్ళు మూటగట్టి.. కట్టి..
నే మొయ్యలేకపోయ్య.. అడుగెయ్యలేకపొయ్య
మొయ్యగలగ బుల్లోడెవడున్నాడయ్య...

కత్తిలాంటి.. ఆ.. మొనగాన్ని.. ఆ..
కండబలుపు .. అహా.. కలవాన్ని
నువ్వెత్తలేని బరువు నేనెత్తిపెట్టలేనా
నా సత్తా చూపిస్తానే అత్తకూతురా

ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
అరెరె.. చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు

ఏకంగా రమ్మంటే లగ్గానికి...  ఏపాటి దమ్ముంది పోరగాడికి
హా.. చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు

చరణం 2  :

ఏరు నిండి ఎల్లువయ్యే... అయ్యే
నోరు ఎండి దాహమయ్యి.. అయ్యి
నాఏటవాలు తెలుసా... ఆ తేట నీకు తెలుసా
ఏపాటి నీకు జ్ఞానమయ్యా మావకొడకా 

పంట చేను... కోతకొచ్చే..
జంట పిట్ట కూతకొచ్చే...
నీ పట్టు నాకు తెలుసు... లోగుట్టు కూడా తెలుసు
ఓ పట్టు పట్టి చూస్తానే పిట్ట మరదలా

చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
కన్నెత్త చెదిరేటి సింగారాలు .. కసికసిగా కాజేస్తా వయ్యారాలు
లాలాల.. లాలాలా.. లలలలలాలలాలాలా ...  

No comments:

Post a Comment