Thursday, June 16, 2016

ఓం శాంతి.. ఓం శాంతి







చిత్రం : ఛాలెంజ్ (1984)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి





పల్లవి :


ఓం శాంతి.. ఓం శాంతి... వయ్యారి వాసంతి
నీ ఈడులో ఉంది వేగం... నీ తోడు నాకుంది భాగం


చంకి చక్కకి చం.. చకచంచక చకకచం
చంకి చక్కకి చం.. చకచంచక చకకచం


ఓం శాంతి.. ఓం శాంతి... నీదేలే పూబంతి




చరణం 1 :



ఒంపుఒంపున హంపి శిల్పమే చూశా... కన్నేశా
లేత నడకలో హంస గమనమే చూశా... కాజేశా


కన్నెనడుమా?  కల్పనా?... కవులు పాడే కావ్యమా
కదిలి వచ్చే శిల్పమా? ... కరిగిపోనీ స్వప్నమా


నీ ఊహలో ఇలా... ఉప్పొంగునా అలా
ఉయ్యాలలూగి యవ్వనాలా నవ్వులన్నీ నీవే కావా



ఓం శాంతి.. ఓం శాంతి... వయ్యారి వాసంతి
నీ పువ్వు నా పూల బాణం... నీ ఊపిరే నాకు ప్రాణం


చంకి చక్కకి చం.. చకచంచక చకకచం
చంకి చక్కకి చం.. చకచంచక చకకచం






చరణం 2 :



నీలవేణిలో కృష్ణవేణినే చూశా... ముడి వేశా
పడతి కొంగులో కడలి పొంగులే చూశా... చుట్టేశా


మేని విరుపా?  మెరుపులా?... బుగ్గ ఎరుపా?  వలపులా?
నీలికనులా?  పిలుపులా? ... మత్తులా?  మైమరపులా? 


నీ చూపుతో ఇలా... నీ సందిటకేలా
ఇన్నాళ్ల నుంచి వేచి ఉన్నా... వెన్నెలంతా నీకే కాగా



ఓం శాంతి.. ఓం శాంతి... వయ్యారి వాసంతి
నీ ఈడులో ఉంది వేగం... నీ తోడు నాకుంది భాగం


చంకి చక్కకి చం.. చకచంచక చకకచం
చంకి చక్కకి చం.. చకచంచక చకకచం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9347

No comments:

Post a Comment