Tuesday, June 21, 2016

చెంపకు చారెడు కళ్ళమ్మా

చిత్రం: అగ్నిగుండం (1984)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి : 

చెంపకు చారెడు కళ్ళమ్మా..ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్
చెంగుకు చాలని ఒళ్లమ్మా..ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్

ఒంపులసొంపుల వయ్యారమ్మా... చంపుకు తినకే బుల్లమ్మ
నిను చూడగనే మతిపోయిందే... కనుగీటగనే కసి పెరిగిందే పొల్లోయ్..

చెంతకు చేరకు బావయ్యో...ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..
చెంగులు చాలవు లేవయ్యో..ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చీకటి చాటున సింగారయ్యో.. సిగ్గులు దోచుకుపోకయ్యో...
తడిపొద్దులలో ఒడి చేరగనే పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో... 

చరణం 1 :

కన్నూ సోకిన్నాడే కట్టూ తప్పింది...
చెయ్యి తాకిన్నాడే చెంగూ జారింది...
ముట్టుకుంటే కట్టుబొట్టూ ఏమౌతాదో?

పక్కకొచ్చిన్నాడే పట్టూ తప్పింది...
గూడు దాచిన్నాడే గుట్టూ చెదిరింది...
ఒళ్లో కొస్తే ఒళ్లు కాస్తా ఏమౌతాదో?

జత కూడగనే జతులాడుకునే...
చలి వేడుకలో తొలి కోరికలే చాలే

చెంపకు చారెడు కళ్ళమ్మా..ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..
చెంతకు చేరకు బావయ్యో...ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చరణం 2 :

ఈడూ వచ్చిన్నాడే ముద్దూ కోరింది...
ఇద్దరయ్యిన్నాడే పొద్దూ జారింది...
మూడూ ముళ్ళూ వేసే లోగా ఏమౌతాదో?

మీసమొచ్చిన్నాడే ఆశ పుట్టింది...
నిన్ను చూసిన్నాడే అగ్గి పుట్టింది...
కల్లోకొచ్చి కౌగిళ్లిస్తే ఎట్టుంటాదో?

పొగమంచులలో పొగరందకురో..
సొగసంచులలో వగలందుకు పోరాదా...

చెంపకు చారెడు కళ్ళమ్మా..
చెంగుకు చాలని ఒళ్లమ్మా..ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్

ఒంపులసొంపుల వయ్యారమ్మా... చంపుకు తినకే బుల్లమ్మ
నిను చూడగనే మతిపోయిందే... కనుగీటగనే కసి పెరిగిందే పొల్లోయ్..

చెంతకు చేరకు బావయ్యో...ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..
చెంగులు చాలవు లేవయ్యో..

చీకటి చాటున సింగారయ్యో.. సిగ్గులు దోచుకుపోకయ్యో...
తడిపొద్దులలో ఒడి చేరగనే పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9354

No comments:

Post a Comment