Tuesday, July 12, 2016

గాజులు ఘల్లనగానే

చిత్రం :  కూతురు కోడలు (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, వసంత 




పల్లవి :


గాజులు ఘల్లనగానే జాజులు ఘుమ్  ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే


తుమ్మెద ఝుమ్ ఝుమ్మనగానే తెమ్మెర రా రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే 



చరణం 1 :



నీ కాటుక కన్నుల సొగసు...  నీ చెంగున దూకే వయసు
నన్నెంతో తొందరచేసే... నీ కౌగిట బందీ చేసే


వెచ్చని వెన్నెలలోన...  విచ్చిన కలువను చూసీ 

నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే






చరణం 2  :



నీ కదిలే పెదవులు చూసి...  నా మెరిసే చెక్కిలి మురిసి
నీ వెచ్చని ఒడిలో చేరి...  నా వయసే పొంగెను నేడే


కోయిల కోయనగానే కొమ్మలు ఓయనగానే   

నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే



చరణం 3 :



నలనల్లని ఆకాశంలో...  తెలతెల్లని మేఘంలాగా
నల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నీ నీలికురులలో విరిసే మరుమల్లెలు నావే నావే


నీ హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
హృదయపు పందిరిమీద...  పెనవేసిన మమతల తీగ
విరబూసిన వలపుల పూలే ఏ నాటికి నావే నావే 


గాజులు ఘల్లనగానే...  జాజులు ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే...  అది నీవే అనుకున్నాలే


తుమ్మెద ఝుమ్మనగానే...   తెమ్మెర రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే


లలలాలాలాలాలల.... లలలాలాలాలాలలలలా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2441

1 comment:

  1. Very nice song. I don't know why it is not very popular..

    ReplyDelete