Monday, August 1, 2016

నా వందనము


చిత్రం : గురు (1980)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : జానకి 




పల్లవి : 


నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా వందనము...  సరసుల రసికుల సదసుకు 


నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...


నా వందనము...  సరసుల రసికుల సదసుకు




చరణం 1 :


తేట తేనియ తెలుగుంది..  తీయ తీయని తలపుంది..
తేట తేనియ తెలుగుంది..  తీయ తీయని తలపుంది..
రాగం ఉందీ.. నాలో వేదం ఉంది..


మాటే పాటై...  పాటే ఆటై..
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా....  ప్రియా



నా వందనము...  సరసుల రసికుల సదసుకు  





చరణం 2 :



పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం


అందాలన్నీ నీకే ఇవ్వాలనీ...  దాచే దాచే వేచే నన్ను
వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా....  ప్రియా



నా వందనము...  సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...




నా వందనము...  సరసుల రసికుల సదసుకు

నా వందనము...  సరసుల రసికుల సదసుకు



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5617

No comments:

Post a Comment