Thursday, October 6, 2016

జీవితం ఏమిటి





చిత్రం :  దేవదాసు (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు



పల్లవి : 



జీవితం... ఏమిటి?
వెలుతురూ... చీకటి..  అంతే
జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి అంతే
వెలుతురంతా చీకటైతే...  అందులోనే సుఖము ఉన్నది
అవును.. జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి 



చరణం 1 :




మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ
తునక తునకలో... నరకమున్నది
మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ
తునక తునకలో... నరకమున్నది 



లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది
ఈ చేదులోనే ఉన్నది... హా... హా... హా... 


జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి



చరణం 2 :




రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే
రామచిలక ఎగిరిపోతే... రాగబంధం సడలిపోతే 


మూగ హృదయం... గాయమైనది
ఆ గాయమే ఒక గేయమైనది...
ఆ గాయమే ఒక గేయమైనది...  



జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి అంతే
వెలుతురంతా చీకటైతే... అందులోనే సుఖము ఉన్నది
 జీవితం ఏమిటి...  వెలుతురూ చీకటి
వెలుతురూ....  చీకటి
వెలుతురూ....  చీకటి






No comments:

Post a Comment