Tuesday, November 1, 2016

వయ్యారాలు సింగారాలు




చిత్రం : అగ్ని పర్వతం (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి  




పల్లవి :


వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలా
ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు నోటిముత్యాలా


ఆహా... వయ్యారాలు సింగారాలు  ఒంటి ముత్యాలా
ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు  నోటిముత్యాలా




అందాలమ్మా ఆటపాట... ఆణిముత్యాలా
బింకాలన్నీ ఎండల్లోన... మంచుముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ... వెన్నెల ముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ... వెన్నెల ముత్యాలా


ఆహా.. వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలా
ఆహా పూసే పువ్వు... నవ్వే నవ్వు నోటిముత్యాలా


తకిట తనం తానం తనంతానం
తకిట తనం తానం తనంతానం




చరణం 1 :


నీరెండల్లో నీ అందాలు... నారింజల్లో రత్నాలూ
పూదండల్లో దారంలాగా నా గుండెల్లో రాగాలూ


కంటిముద్దు పెట్టేలోగా... గాలిచీర కట్టేలోగా
నల్లనిజళ్ళో  నీలాలన్నీ ఎవ్వరికిస్తావో


వేకువమ్మ చూసేలోగా పాపిటంతతీసేలోగా
నున్నని మెళ్ళో వెన్నెలహారం..ఎప్పుడు వేస్తావూ


మందారమొగ్గకన్న బుగ్గెర్రనా..మాణిక్యరవ్వ కన్నా తానెర్రనా
మరుమల్లెపూవు కన్నా తను తెల్లనా
ఎన్నెల్లో పాల కన్నా ఎద తెల్లనా


ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలా
ఆహా పూసే పువ్వు... నవ్వే నవ్వు నోటిముత్యాలా



చరణం 2  :



నా కళ్ళల్లో నీ రూపాలు వాకిళ్ళల్లో దీపాలూ
దీపాలన్నీ చిదిపే నిన్ను చేసారేమో దైవాలూ


లేతపూలు కోసేలోగా శీతగాలి వీసేలోగా
చల్లని నీడల చాటున సందడి ఎప్పుడు చేస్తావో


ఎర్రబొట్టు పెట్టేలోగా... కుర్రపొద్దు పుట్టేలోగా
చీకటి సందున చిక్కిన కౌగిలికి ఎప్పుడు వస్తావో


చామంతి చెంపమీద చెయ్యేసుకో...పారాణి ఆశలన్ని పండించుకో
సిగ్గింటి గోడదాటి నన్నందుకో... ముద్దింటిదారితోక్కి నన్నేలుకో


ఆహా వయ్యారాలు సింగారాలు వంటి ముత్యాలా
ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు నోటిముత్యాలా


అందాలమ్మా ఆటపాట..ఆణిముత్యాలా
బింకాలన్నీ ఎండల్లోన... మంచుముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా
వన్నే చిన్నే వాటాలన్నీ..వెన్నెలముత్యాలా


ఆహా వయ్యారాలు సింగారాలు వంటి ముత్యాలా
ఆహా పూసే పువ్వు..నవ్వే నవ్వు నోటిముత్యాలా 


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హూ మ్మ్ మ్మ్ మ్మ్
తననం తనన తననం తనన..తననం తనన
తననం తనన తననం తనన..తననం తనన





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3795

No comments:

Post a Comment