Sunday, November 27, 2016

నాద నిలయుడే శివుడు







చిత్రం  : పార్వతీపరమేశ్వరులు (1982)
సంగీతం  :  సత్యం
గీతరచయిత  :
నేపధ్య గానం  :  జానకి




పల్లవి :



ఆ.. ఆ.. ఆ.. ఆ...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ



నాద నిలయుడే శివుడు...
నాద నిలయుడే శివుడు...
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు



చరణం 1 :



అఖిల జగత్ వాగ్మయుడు... ఆ.. ఆ.. ఆ.. ఆ..
అఖిల జగత్ వాగ్మయుడు... సకల కళా తన్మయుడు
అఖిల జగత్ వాగ్మయుడు... సకల కళా తన్మయుడు


మారహరుడు... మార హరుడు
సనిదపపదనిని సరిగపపదనినిస
మార హరుడు... రిగమదపమసనినిదనినిస
మార హరుడు... మార హరుడు...
ప్రణతాది హరుడు.. గౌరీ మనోహరి మనోహరుడు




నాద నిలయుడే శివుడు
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ




చరణం 2  :




రసమయ కేదారగౌళానువర్తి... ఆ.. ఆ.. ఆ.. ఆ
రసమయ కేదారగౌళానువర్తి
వినలేడా నాదు ఆర్తి...
రసమయ కేదారగౌళానువర్తి
వినలేడా నాదు ఆర్తి...


రాగాల అనురాగమొలికించు వేళా
రాగాల అనురాగమొలికించు వేళా... కదలాడదే పాదపంక్తి
రాగాల అనురాగమొలికించు వేళా... కదలాడదే పాదపంక్తి 



భువనభవన చిద్ గగన వీధి ఆనంద తాండవం ఏది?
సురనర పూజిత స్వరపద రంజిత అమర నాట్యగతులేవి? 


మగరి.. మపదనినిసరిగరి
మపని సరిమగనిసనిదప
పపరిస రిరి
పమపని సస
సనినిసనిదప రిపమగరిస
రిసరి మగరి
రిసరి మగరి
రిమసరిస రిపదనిస
సరిమగరిస రిమనిరసరి
పమగరిసరిసనిసనిదపమప
పరినిసరిమగరిసదపమగరినిస
సరిమగరిస రిపమ పమగరి
సరిమ పనిదప రిపమగరి
పసనిదప గమపదని 



నాద నిలయుడే శివుడు...
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు 




చరణం 3 : 



సరలిత నటరాజమూర్తి
షణ్ముఖప్రియరాగ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
షణ్ముఖప్రియరాగ భోగానువర్తి
సరలిత నటరాజమూర్తి
షణ్ముఖప్రియరాగ భోగానువర్తి
సరలిత నటరాజమూర్తి



కైలాశశిఖరాగ్ర శైలూషికానాట్య పరివేష్టితాఖండ కీర్తీ
కైలాశశిఖరాగ్ర శైలూషికానాట్య పరివేష్టితాఖండ కీర్తీ 


చతుర్వేదములు...  పంచభూతములు
ఆరుఋతువులు...  సప్తవర్ణములు
చతుర్వేదములు...  పంచభూతములు
ఆరు ఋతువులు...  సప్తవర్ణములు
అష్టదిక్కుములు...  నవరసాకృతులు
దశోపనిషత్తులై కొనియాడగ  




నాద నిలయుడే శివుడు... ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు
ఆదిమధ్యాంత లయుడు
ప్రణవ నాద నిలయుడే శివుడు  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9085





No comments:

Post a Comment