Wednesday, November 30, 2016

అరవైలో ఇరవై వచ్చింది

చిత్రం  :  భోగి మంటలు (1972)
సంగీతం  : రమేశ్ నాయుడు
గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, 
వాణీ జయరాం 

పల్లవి :

అరవైలో ఇరవై వచ్చింది..
మా అమ్మానాన్నకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై వచ్చింది..
మా అమ్మానాన్నకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై వచ్చింది..
మా అత్తామామకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై వచ్చింది..
మా అత్తామామకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

చరణం 1 :

పెళ్ళికూతురుగ చేస్తుంటే మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది
పెళ్ళికూతురుగ చేస్తుంటే మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది

పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు ఆడతనం నేర్పింది
పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు ఆడతనం నేర్పింది

నెరిసీనెరవని మీసాల్లో మెరిసే ముసిముసినవ్వులలో
నెరిసీనెరవని మీసాల్లో మెరిసే ముసిముసినవ్వులలో

పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో....
పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో.... ఇప్పుడే మాకు తెలిసింది
పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో.... ఇప్పుడే మాకు తెలిసింది

అరవైలో ఇరవై వచ్చింది..
మా అమ్మానాన్నకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై వచ్చింది..
మా అత్తామామకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

చరణం 2 :

మనసులు మమతలు మారని వాళ్ళే దేవుళ్ళు
మనసులు మమతలు మారని వాళ్ళే దేవుళ్ళు
మనకగపడుతున్న దేవుళ్ళే అమ్మానాన్నలూ

ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే మనకూ దీవెనలూ...
ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే మనకూ దీవెనలూ...
ఆ దీవెనలే మన కోరికలైతే వీళ్లకు నూరేళ్లు... వీళ్లకు నూరేళ్లు

అరవైలో ఇరవై వచ్చింది..
మా అత్తామామకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

అరవైలో ఇరవై వచ్చింది..
మా అమ్మానాన్నకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది

చరణం 3 :

ఆనాటి శ్రీరఘురాముడే... ఈనాటి పట్టాభిరాముడు
జనకుడు లేని కల్యాణాన్నే కొడుకులు కలిసి చేస్తున్నారు

చక్కగ గంధం అలగండి... చల్లని పన్నీరు చిలకండి
చక్కగ గంధం అలగండి... చల్లని పన్నీరు చిలకండి
తాళిని కట్టే వేళయ్యింది.. గట్టి మేళం మ్రోగించండి
గట్టి మేళం మ్రోగించండి....

సీతామ్మ పెళ్లికూతురాయనే.. మన రామయ్య పెళ్ళికొడుకాయనే
సీతామ్మ పెళ్లికూతురాయనే.. మన రామయ్య పెళ్ళికొడుకాయనే

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3767

No comments:

Post a Comment