Thursday, January 5, 2017

అందమైనది ముందర ఉంది



చిత్రం :   నెంబర్ వన్ (1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
గీతరచయిత :  జొన్నవిత్తుల
నేపధ్య గానం :  బాలు, చిత్ర 




పల్లవి :


అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
రంభ మరదలు రంజుగ ఉంది
సంబరానికి సయ్యని అంది


పాలపొంగుకి ఆశగ ఉంది
పైటకొంగుకి కోరిక ఉంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది



చరణం 1 :



అడిగిందీ రాచిలకా...  అలకలు తీర్చు రసగుళికా
తగిలిందా చెలి చురకా...  సరిగమపా సరసమిక
అరె మొదలెడితే తెర వెనుక...  మెరుపులమేను తకిటతక


విరబూసే వయసు ఇక... నిలవదుపా నువు లేక
అరె మోజైతే సయ్యంటు రాక...  మొహమాటమేలా ఇక


ఊరంతా గగ్గోలు కాక...  చూడాలి నువ్వే ఇక
గుండెలో ఏ బెంగలేక...  గుట్టుగా రావే ఇక
జోరుగా నూరేళ్ళదాకా...  ఎగరేయి జెండా ఇక   


అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది



చరణం 2 :



తపనలలో తలమునక...  చలిచలివేళ చమకుచక
పొదవెనుక పరువమిక...  పదనిసలే పలుకునిక
ఆ చురుకుమనే చూపులకి...  శృతిమించేను సోకు ఇక
ముదిరినదా మురిపమిక...  మొదలుకదా మోత ఇక



నువ్వంటే పడిచస్తా మామా...  నీకే నా సోకిస్తా రా
నీకోసం దిగి వచ్చా భామా...  వలపిస్తా వడిపట్టవే


గుండెల్లో కోయిళ్ళ కూత...  తీయనా నీ కౌగిట
బుగ్గలో దానిమ్మపూత...  ఓలమ్మీ ఈ సందిట 



అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
రంభ మరదలు రంజుగ ఉంది
సంబరానికి సయ్యని అంది


పాలపొంగుకి ఆశగ ఉంది
పైటకొంగుకి కోరిక ఉంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది





No comments:

Post a Comment