Wednesday, January 4, 2017

దొరికేరూ దొరగారు

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి : 

దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ..

దొరికేరూ దొరగారు... ఇక నిన్ను విడబోరు
ఆశలన్నీ తీరేదాకా ఆగలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ.. 

చరణం 1 :

ఏ మాయ చేసినారో వీరు... నిలిచారు నా కంటిచూపులో
ఏ మాయ చేసినారో వీరు... నిలిచారు నా కంటిచూపులో

మాయ నీదే మర్మం నీదే... హాయి నాదే అమ్మమ్మ.. ఆ.. ఆ..

చరణం 2 :

అనురాగ మధువులు చల్లే.. ఓ మల్లే.. ఈ సిగ్గు నీకేలా.. ఆ.. ఆ..
అనురాగ మధువులు చల్లే.. ఓ మల్లే.. ఈ సిగ్గు నీకేలా

అందం అంతా తమదే కాదా... తొందరేలా అమ్మమ్మ... ఆ.. ఆ..హోయ్

దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ..

చరణం 3 :

నీవాడనని చేరినంత... నన్నింత ఊరించనేలనే...
నీవాడనని చేరినంత... నన్నింత ఊరించనేలనే...

అందీ అందని అందంలో ఆనందం ఉందీ...  అమ్మమ్మ.. ఆ.. ఆ.. హోయ్

చరణం 4 :

దొరగారిని దొంగంటేనే చాలా.. ప్రియురాలా.. బంధించరావేలా
దొరగారిని దొంగంటేనే చాలా.. ప్రియురాలా.. బంధించరావేలా

పారిపోయే దొంగైతేనే బంధించాలి...  అమ్మమ్మ... ఆ.. ఆ. హోయ్

దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు... అమ్మమ్మ.. ఆ.. ఆ..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1581

No comments:

Post a Comment