Thursday, February 9, 2017

అంగట్లో అన్నీ ఉన్నాయ్







చిత్రం :  మైనరు బాబు (1973)
సంగీతం :  టి చలపతిరావు
గీతరచయిత :  సినారె  
నేపధ్య గానం :  పిఠాపురం 



పల్లవి : 


అంగట్లో అన్నీ ఉన్నాయ్... అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?


అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?         



చరణం 1 :


బెజవాడ ప్రక్కనే కృష్ణ ఉందీ
నిండా నీరు వుందీ...  బాగా పారుతుందీ
పట్టణంలో నీళ్ళ పంపులెన్నో ఉన్నా
పట్టుకుందామంటే బండి సున్నా
నీల్లు నిండుసున్నా... నోళ్ళు ఎండునన్నా 


అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?         



చరణం 2 :



ఏడుకొండలవాడా వెంకట్రమణా... గోవిందా గోవింద
తిరుపతి వెంకన్న దయవుందీ... పైగా డబ్బు ఉందీ
అయితే మనకేముందీ 


పూటకోక్క కాలేజి పుడుతుందీ
చదువులే చెప్పేస్తుందీ... డిగ్రీలిచేస్తుందీ
ఆ డిగ్రీలు మోసుకుని ఢిల్లీ దాకా వెళ్ళి..ఉద్యొగాలిమ్మంటే ఏమవుతుందీ 


ఏమవుతుందీ... కాలు అరగుతుందీ... చొక్కా చిరుగుతుందీ
ఆకలి పెరుగుతుందీ... ఆయాసం మిగులుతుందీ
ఆకలి పెరుగుతుందీ... ఆయాసం మిగులుతుందీ
అప్పటికీ నువు అక్కడేవుంటే చిప్పచేతికే వస్తుందీ... చిప్పచేతికే వస్తుందీ 


అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?         




చరణం 3 :


మైనరు బాబుకు లోటేముందీ
డబ్బుకు లోటేముందీ... తిండికి లోటేముందీ
అందుకే పంతాలు మానేసి... పట్టింపులొదిలేసి
దర్జాగ ఇంటికి చేరుకుంటే... చేరుకుంటే ?


దొరుకుతుంది ఇడ్లి అయినా... గడుస్తుంది ఒక పూటైనా
నీ కోసం కాకున్నా... మా కోసం పదరా నాయనా
నీ కోసం కాకున్నా... మా కోసం పదరా నాయనా
ఎంత చెప్పినా యిదిలిచుకొని..ఎక్కడికో పోతున్నాడే
ఇంటికి రానన్నాడే... వాట్ టుడూ 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7855

No comments:

Post a Comment