Wednesday, February 1, 2017

బంగారు చిలకమ్మ

చిత్రం : భార్యామణి  (1984)
సంగీతం :  బాలు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి  




పల్లవి :


బంగారు చిలకమ్మ... భార్యామణి
సింగారి గోరింకా... సీతాపతి


మసకేస్తే పోయే మతి... అలకొస్తే చాపే గతి
మసకేస్తే పోయే మతి... అలకొస్తే చాపే గతి
సీతాపతి... చాపే గతి
భార్యామణి... పోయే మతి



బంగారు చిలకమ్మ... భార్యామణి
సింగారి గోరింకా... సీతాపతి



చరణం 1 :



నీ లేత నవ్వులలో వెన్నెల పుట్టి... లలలలలా
జాజులే జల్లింది... జల్లెడ పట్టి... లలలలలల


నీ కౌగిలింతలో వేసవి పుట్టి... లలలలల
దాహమే అడిగింది తపనలు పుట్టి... లలలలల


అందుకే లోకంలో చీకటి పుట్టి... చీరచెంగును పట్టి
మూడుముద్దులు పెట్టి... రెండు కన్నులు కొట్టి
ఒక పక్కలో పండించే వలపంతా
ఏ పక్క  నిను తాకినా చక్కిలిగింతా...



బంగారు చిలకమ్మ... భార్యామణి
సింగారి గోరింకా... సీతాపతి
మసకేస్తే పోయే మతి... అలకొస్తే చాపే గతి
మసకేస్తే పోయే మతి... అలకొస్తే చాపే గతి
సీతాపతి... చాపే గతి
భార్యామణి... పోయే మతి



బంగారు చిలకమ్మ... భార్యామణి
సింగారి గోరింకా... సీతాపతి



చరణం 2 :



నీ అందచందాల ఆవిరిపట్టి... లలలలలా
తెల్లారనివ్వద్దు కోడిని పట్టి... లలలలలా


తొలిజాము రాతిరి చలి కాబట్టి... లలలలలా
దుప్పట్లో దూరిపో అలజడి పుట్టి... లలలలలా


అందుకే లోకంలో ఆడది పుట్టి... అత్త ఇంటిని మెట్టి
కొత్త కాపురమెట్టి... మగని కొంగున కట్టి... ఆ
ఒక కంచంలో వడ్డిస్తే సొగసంతా...
ఒక మంచంలో గడిపేస్తా నా వయసంతా


బంగారు చిలకమ్మ... భార్యామణి
సింగారి గోరింకా... సీతాపతి


మసకేస్తే పోయే మతి... అలకొస్తే చాపే గతి
మసకేస్తే పోయే మతి... అలకొస్తే చాపే గతి
సీతాపతి... చాపే గతి
భార్యామణి... పోయే మతి



బంగారు చిలకమ్మ... భార్యామణి
సింగారి గోరింకా... సీతాపతి






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2839

No comments:

Post a Comment