Wednesday, February 1, 2017

సీతమ్మ నోచింది చిత్రాల నోము

చిత్రం : భార్యామణి  (1984)
సంగీతం :  బాలు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 




పల్లవి :


సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
రామయ్య చేశాడు చిగురాకు పూజా... ఉహ్మ్మ్ .. ఉహ్మ్మ్.. 


సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
రామయ్య చేశాడు చిగురాకు పూజా... ఉహ్మ్మ్ .. ఉహ్మ్మ్.. 


సీతమ్మ నోచింది చిత్రాల నోము...
రామయ్య చేశాడు చిగురాకు పూజా
సిరులున్న వాకిట సీతమ్మ నిలిచే...
సీతమ్మ సిగ్గులే మొగ్గలై వెలసే
సీత ఇంటికి చాలు రామ వాకిళ్లు
రాముడొస్తే ఎరుపు సీత చెక్కిళ్లు



సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
రామయ్య చేశాడు చిగురాకు పూజా... ఉహ్మ్మ్ .. ఉహ్మ్మ్.. 


చరణం 1 :


నిదుర లేచే వేళ ఉదయమాలక్ష్మి
జలకమాడే వేళ జాహ్నవి దేవి
ఎదుటనున్నా ఓర్పు ముద్ద మందారం
గృహలక్ష్మి దిద్దితే కనక సింధూరం



నిదుర లేచే వేళ ఉదయమాలక్ష్మి
జలకమాడే వేళ జాహ్నవి దేవి
ఎదుటనున్నా ఓర్పు ముద్ద మందారం
గృహలక్ష్మి దిద్దితే కనక సింధూరం 



ఎదురు వస్తే చాలు ఎదురులేరంట
మురిసి చూసే కన్ను నిదురపోదంట
ఎదురు వస్తే చాలు ఎదురులేరంట
మురిసి చూసే కన్ను నిదురపోదంట


సీత మెట్టిన ఇల్లు సిరికి నట్టిల్లు
ఆ హరికి పుట్టిల్లు అవని హరివిల్లు  


సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
రామయ్య చేశాడు చిగురాకు పూజా... ఉహ్మ్మ్ .. ఉహ్మ్మ్..  




చరణం 2 :


అన్నపూర్ణా దేవి అందాల భరిణా
ఆ కంట చూడాలి అమ్మలా కరుణా
వంటపనితో తాను అలిసేది కొంత
ఇంటి పనితో తాను సొలిసేది సుంత


అన్నపూర్ణా దేవి అందాల భరిణా
ఆ కంట చూడాలి అమ్మలా కరుణా
వంటపనితో తాను అలిసేది కొంత
ఇంటి పనితో తాను సొలిసేది సుంత


వయ్యారమున తాను భూజాత పాటి
ఓర్పులోనా తాను భూమాత సాటి


వయ్యారమున తాను భూజాత పాటి
ఓర్పులోనా తాను భూమాత సాటి 


లేమి అన్నది లేదు నడుముకే కానీ
కాలు పెడితే కలిమి కనకమాలక్ష్మి 


 

సీతమ్మ నోచింది చిత్రాల నోము... ఆ.. ఆ...
రామయ్య చేశాడు చిగురాకు పూజా... ఉహ్మ్మ్ .. ఉహ్మ్మ్.. 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2686

No comments:

Post a Comment